గ్రహం అనుగ్రహం (14-08-2020)

14 Aug, 2020 05:56 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.దశమి ఉ.10.28 వరకు, తదుపరి ఏకాదశినక్షత్రం మృగశిర తె.4.28 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి ఆరుద్ర, వర్జ్యం ఉ.9.02 నుంచి 10.43 వరకు, దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.08 వరకు, తదుపరి ప.12.29 నుంచి 1.21 వరకు
అమృతఘడియలు... రా.7.06 నుంచి 8.45 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.24
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

గ్రహఫలం
మేషం....ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. నూతన పరిశోధనలపై ఆసక్తి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం...కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.

మిథునం....కొన్ని వ్యవహారాలు మందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం....చిన్ననాటి కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం...నిరుద్యోగుల యత్నాలు కొంత అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య....కొత్త రుణాల కోసం యత్నిస్తారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

తుల....కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు. ధనవ్యయం. బంధువర్గంతో అకారణంగా వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకుల పరుస్తాయి.

వృశ్చికం....బంధువులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక లావాదేవీల్లో మరింత పురోగతి. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి.

ధనుస్సు....పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మెరుగ్గా ఉంటాయి.

మకరం....వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

కుంభం....వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మీనం...ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ధన, వస్తులాభాలు. అంచనాలు నిజం కాగలవు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగస్తులకు విజయాలు.

మరిన్ని వార్తలు