గ్రహం అనుగ్రహం (15-08-2020)

15 Aug, 2020 05:49 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి బ.ఏకాదశి ఉ.11.00 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం ఆరుద్ర తె.5.18 వరకు (తెల్లవారితే ఆదివారం) వర్జ్యం ప.1.07 నుంచి 2.47 వరకు, దుర్ముహూర్తం ఉ.5.45 నుంచి 7.24 వరకు, అమృతఘడియలు... సా.6.55 నుంచి 8.34 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.24
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

గ్రహఫలం
మేషం... కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. శుభవార్తా శ్రవణం. రాబడి పెరిగి రుణాలు తీరుస్తారు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. 

వృషభం...అనుకోని ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు. రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. పనులలో ఆటంకాలు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు. 

మిథునం..ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. ఆలయ దర్శనాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో  అసంతృప్తి. 

కర్కాటకం..కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వాహనాలు,ఆభరణాలు కొంటారు.  వ్యాపారులకు లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో మరింత పురోగతి. 

సింహం.....పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. కుటుంబ,ఆరోగ్యసమస్యలు. నిర్ణయాలలో నిదానం పాటించండి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.  ఉద్యోగాల్లో ఊహించని మార్పులు . 

కన్య...ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు  చిక్కులు తొలగి ఊరట చెందుతారు. 

తుల....బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. రావలసిన బాకీలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో కొత్త హోదాలు పొందుతారు. 

వృశ్చికం...ప్రయాణాల్లో ఆటంకాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. నిర్ణయాలలో నిదానం అవసరం. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు నిలకడగా  ఉండవు. వ్యాపార లావాదేవీలలో మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాల్లో పనిభారం తప్పదు. 

ధనుస్సు...ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటాబయటా సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం

మకరం...ముఖ్యమైన పనుల్లో విజయం. ఆస్తిలాభ సూచనలు. బంధుమిత్రులతో  వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.. 

కుంభం...వ్యవహారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాబడి పెరిగి అప్పులు తీరతాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు. 

మీనం...ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు అధికం. ఆలయ దర్శనాలు. బంధువులతో విరోధాలు. వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు.

మరిన్ని వార్తలు