ఈ రాశివారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది

15 Aug, 2021 06:30 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.సప్తమి ఉ.9.50 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం స్వాతి ఉ.6.46 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం ప.11.59 నుండి 1.29 వరకు, దుర్ముహూర్తం సా.4.43 నుండి 5.33 వరకు, అమృతఘడియలు రా.8.55 నుండి 10.24 వరకు.

సూర్యోదయం :  5.45   సూర్యాస్తమయం :  6.24
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: పనుల్లో పురోగతి. సోదరులు, సోదరీలతో సఖ్యత. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో ప్రోత్సాహం. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.

మిథునం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆస్తుల వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

కన్య: కొన్ని సమస్యలు ఎదురై సవాలుగా మారతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

తుల: కొత్త విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి. భూలాభాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం: రుణబాధలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

మకరం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

కుంభం: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళం.

మరిన్ని వార్తలు