ఈ రాశి వారు ఆర్థికంగా మెరుగుపడతారు..

15 Jan, 2021 06:01 IST|Sakshi

మేషం: ఆకస్మిక ధనలబ్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. మీసేవలకు గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఆలయాల దర్శనాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం.

వృషభం: కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. ప్రయాణాలలో మార్పులు.

మిథునం: ఆస్తి వివాదాలు. పనుల్లో అవరోధాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. అనారోగ్యం.

కర్కాటకం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ప్రోత్సాహం. ఆలోచనలు కలసివస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.

సింహం: మిత్రుల నుంచి సహాయం. ఆర్థికాభివృద్ధి కనిపిస్తుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులకు శుభవర్తమానాలు.

కన్య: ప్రయాణాలు వాయిదా వేస్తారు. కొన్ని పనుల్లో ఆటంకాలు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. నిరుద్యోగులకు శ్రమకు ఫలితం కనిపించదు.

తుల: బంధువులు, మిత్రులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పవు. కళాకారులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. శ్రమాధిక్యం.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సమర్థతను చాటుకుంటారు. కొన్ని సమస్యల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. కళాకారులకు నూతనోత్సాహం.

ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. కొన్ని పనుల్లో ఆటంకాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: ప్రముఖ వ్యక్తుల సహాయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. వాహనసౌఖ్యం. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

మరిన్ని వార్తలు