గ్రహం అనుగ్రహం (15-10-2020)

15 Oct, 2020 06:45 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, అధిక ఆశ్వయుజ మాసం, తిథి బ.త్రయోదశి ఉ.6.24 వరకు, తదుపరి చతుర్దశి తె.4.12 వరకు (తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం ఉత్తర సా.5.30 వరకు తదుపరి హస్త, వర్జ్యం రా.1.22 నుంచి 2.54 వరకు, దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.35 వరకు, తదుపరి ప.2.29 నుంచి 3.15 వరకు, అమృతఘడియలు... ఉ.10.42 నుంచి 12.11 వరకు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.37
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశిఫలాలు:
మేషం: వ్యవహారాలలో అనుకూలత. ధన, వస్తులాభాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

మిథునం: ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కర్కాటకం: శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

సింహం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు.

కన్య: శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

వృశ్చికం:దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పనులలో ఆటంకాలు తొలగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల సహాయం అందిస్తారు. ధనప్రాప్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మకరం: వ్యవహారాలు నిదానంగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కుంభం: శ్రమానంతరం పనులు పూర్తి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులు విరోధాలు. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మీనం: నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధనలాభం. ఆధ్యాత్మిక చింతన. కొత్త వ్యాపారాలు ప్రారంభం. ఉద్యోగాలలో అబివృద్ధి.
 

>
మరిన్ని వార్తలు