గ్రహం అనుగ్రహం (15-11-2020) 

15 Nov, 2020 07:42 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు; నిజ ఆశ్వయుజ మాసం;బహుళ పక్షం అమావాస్య: ఉ.1124 తదుపరి శుక్లపక్ష పాడ్యమి విశాఖ: రా.711 వర్జ్యం: రా.1056 నుంచి 1225 వరకు అమృత ఘడియలు: రా.1058 నుంచి 1228 వరకు దుర్ముహూర్తం: సా.351 నుంచి 436 వరకు రాహుకాలం: సా.430 నుంచి 600 వరకు

సూర్యోదయం: ఉ.608
సూర్యాస్తమయం: సా.521

 

రాశిఫలం:
మేషం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు దక్కుతాయి. ధన, వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ముందంజ.

వృషభం: బంధువులతో సఖ్యత. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిథునం:మిత్రులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యయప్రయాసలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటుంది. దైవచింతన. వృత్తులు, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

సింహం: అనుకున్న కార్యక్రమాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలత. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కన్య:ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

తుల: కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

వృశ్చికం: దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. దూరప్రయాణాలు. పనులలో జాప్యం. బంధువర్గం నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పవు.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవచింతన.

మకరం: వ్యవహారాలలో విజయం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ధ్యేయాలు నెరవేరతాయి.

కుంభం:ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో నిరాశ.

మీనం: వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

మరిన్ని వార్తలు