ఈ రాశివారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు

15 Jul, 2021 06:15 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి శు.షష్ఠి తె.4.02 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి సప్తమి, నక్షత్రం ఉత్తర రా.2.15 వరకు, తదుపరి హస్త వర్జ్యం ఉ.9.50 నుండి 11.22 వరకు, దుర్ముహూర్తం ఉ. 9.54 నుండి 10.46 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.58 వరకు అమృతఘడియలు... రా.7.11 నుండి 8.45 వరకు.

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: కొన్ని పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. ఉద్యోగులకు పనిభారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు.

మిథునం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుసుకుంటారు.

సింహం: అరుదైన ఆహ్వానాలు రాగలవు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాభివృద్ధి.

కన్య: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు.

తుల: వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు.

ధనుస్సు: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు.

మీనం: నూతన ఉద్యోగయోగం. పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు.
 

మరిన్ని వార్తలు