శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.అష్టమి ఉ.7.29 వరకు, తదుపరి నవమి తె.5.04 వరకు(తెల్లవారితే మంగళవారం), నక్షత్రం అనూరాధ రా.3.03 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం ఉ.8.51 నుండి 10.22 వరకు దుర్ముహూర్తం ప.12.30 నుండి 1.21 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.52 వరకు, అమృతఘడియలు...సా.5.47 నుండి 7.18 వరకు.
సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.23
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
రాశి ఫలాలు:
మేషం: వ్యవహారాలలో అవరోధాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు. దైవదర్శనాలు.
వృషభం: పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆర్థిక విషయాలలో ఆటుపోట్లు తొలగుతాయి. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మిథునం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
సింహం: మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కాంట్రాక్టులు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
తుల: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్య సూచనలు. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.
మకరం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ముఖ్య నిర్ణయాలు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు.
మీనం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం.