ఈ రాశివారు సమస్యల నుంచి గట్టెక్కుతారు..

16 Jan, 2021 06:03 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం హేమంత, ఋతువు, పుష్య మాసం, తిథి శు.తదియ ఉ.8.48 వరకు, తదుపరి చవితి, నక్షత్రం ధనిష్ఠ ఉ.6.44, వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం... లేదు దుర్ముహూర్తం ఉ.6.38 నుంచి 8.06 వరకు అమృతఘడియలు... లేవు, ముక్కనుమ.

సూర్యోదయం :    6.39
సూర్యాస్తమయం    :  5.42
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: భూ, గృహయోగాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం: సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ మరింత  గౌరవం. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో అకారణ వైరం. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు..

కర్కాటకం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. అనుకున్న పనులు మధ్యలో విరమిస్తారు.

సింహం: నిరుద్యోగుల యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం. వాహనాలు కొంటారు. పనులు చకచకా సాగుతాయి.

కన్య: కాంట్రాక్టర్లకు మరింత వృద్ధి.  కొన్ని ఒత్తిడులు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. భూలాభం. వ్యవహారాలలో విజయం.. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. పనుల్లో ఆటంకాలు.  కుటుంబ సమస్యలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం. పారిశ్రామికవేత్తలకు చిక్కులు.

వృశ్చికం: బంధువులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో  ఆటంకాలు చికాకు పరుస్తాయి. కొన్ని అంచనాలు తప్పుతాయి. బాద్యతలు మరింత పెరుగుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: ఊహించని∙ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని  సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఉద్యోగలాభం.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. శ్రమ పెరుగుతుంది..

కుంభం: దూరబంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం: ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం.  వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. పరిస్థితులు అనుకూలించవు.
 

మరిన్ని వార్తలు