ఈ రాశివారికి పనుల్లో పురోగతి..

16 Dec, 2020 06:29 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.విదియ సా.6.57 వరకుతదుపరి తదియ నక్షత్రం పూర్వాషాఢ రా.10.43 వరకు తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం ఉ.8.44 నుంచి 10.17 వరకుదుర్ముహూర్తం ప.11.32 నుంచి 12.15 వరకు అమృతఘడియలు... సా.6.01 నుంచి 7.34 వరకు.

సూర్యోదయం :    6.26
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు:
మేషం: చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

వృషభం:కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

కర్కాటకం: పనుల్లో పురోగతి. కుటుంబసమస్యలు తీరతాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

సింహం: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృశ్చికం: శ్రమ తప్పకపోవచ్చు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: పరిచయాలు విస్తృతమవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త పనులు చేపడతారు. ధనలాభం. పరిస్థితులు మరింత అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం: బంధువుల నుంచి ఒత్తిళ్లు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
 

మరిన్ని వార్తలు