ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం

16 Jul, 2021 06:08 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి శు.సప్తమి రా.2.17వరకు, తదుపరి అష్టమి నక్షత్రం హస్త రా.1.18 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం ఉ.10.18 నుండి 11.51 వరకు, దుర్ముహూర్తం ఉ.8.13 నుండి 9.05 వరకు తదుపరి ప.12.30 నుండి 1.24 వరకు, అమృతఘడియలు... రా.7.30 నుండి 9.01 వరకు, దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం.

సూర్యోదయం :    5.37
సూర్యాస్తమయం     :  6.34
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం.

వృషభం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు ఉంటాయి. దైవదర్శనాలు.

మిథునం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం.

కర్కాటకం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

సింహం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో  మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు ఉంటాయి.

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆస్తుల వివాదాలు. దూరప్రయాణాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్యం. దైవదర్శనాలు.

వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మకరం: ప్రయాణాల్లో మార్పులు. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. పనులు మందగిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ధనవ్యయం.

కుంభం: దూరప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. బంధువులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
 

మరిన్ని వార్తలు