ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు..

17 Apr, 2021 06:02 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి శు.పంచమి సా.4.30 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం మృగశిర రా.10.50 వరకు తదుపరి ఆరుద్ర, వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.5.48 నుండి 7.25 వరకు, అమృతఘడియలు... ప.1.11 నుంచి 2.56 వరకు, శ్రీపంచమి.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.11
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు. 

వృషభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు. బంధువులతో వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు.

మిథునం: మిత్రులతో వివాదాలు. కుటుంబ బాధ్యతలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు నిరాశ. వృత్తి, వ్యాపారాలు నత్తనడనక సాగుతాయి. దూరప్రయాణాలు.

కర్కాటకం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి.

కన్య: పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక  పరిస్థితి మందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు. ఆలయ దర్శనాలు.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక లావాదేవీలలో నిరుత్సాహం.  విద్యార్థులకు కొంత నిరాశ. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పవు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వస్తులాభాలు.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి.

మకరం: ఆర్థిక లావాదేవీలలో ఒదుడుకులు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత తప్పదు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చికాకులు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు..

కుంభం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం.  ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం

మీనం: నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యవహారాలలో పురోగతి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. 
 

మరిన్ని వార్తలు