ఈ రాశివారికి వాహన యోగం..

17 Jan, 2021 06:09 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.చవితి ఉ.9.12 వరకు తదుపరి పంచమి, నక్షత్రం శతభిషం ఉ.7.31 వరకు, తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం ప.2.20 నుంచి 4.01 వరకు దుర్ముహూర్తం సా.4.12 నుంచి 4.56 వరకు, అమృతఘడియలు... రా.12.31 నుంచి 2.11 వరకు.

సూర్యోదయం        :  6.39
సూర్యాస్తమయం    :  5.42
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: కొత్త పనులకు శ్రీకారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. ధనలాభ సూచనలు.

వృషభం: దూరపు  బంధువులను కలుసుకుంటారు. వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందువినోదాలు. శుభవర్తమానాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

తుల: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. బంధువులతో తగాదాలు.

వృశ్చికం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు. శ్రమ మరింత పెరుగుతుంది.

ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు వింటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

మకరం: కుటుంబసమస్యలు తప్పవు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: కుటుంబంలో సంతోషకరమైన సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొన్ని మార్పులు. ఆర్థిక ఇబ్బందులు.
 

మరిన్ని వార్తలు