గ్రహం అనుగ్రహం (17-10-2020)

17 Oct, 2020 06:32 IST|Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి శు.పాడ్యమి రా.11.30 వరకు తదుపరి విదియ, నక్షత్రం చిత్త ప.2.20 వరకు, తదుపరి స్వాతి వర్జ్యం రా.7.32 నుంచి 9.01 వరకు, దుర్ముహూర్తం ఉ.5.55 నుంచి 7.30 వరకు, అమృతఘడియలు... ఉ.8.22 నుంచి 9.44 వరకు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.35
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

రాశిఫలం:
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కాస్త ఒత్తిడులు తగ్గుతాయి.

వృషభం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం: వ్యయప్రయాసలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

సింహం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

కన్య: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు.

తుల: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం: బంధువులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.

ధనుస్సు: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. వాహనసౌఖ్యం. విలువైన సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

మకరం: కొత్త పనులకు శ్రీకారం. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు బదిలీలు.

మీనం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. పనుల్లో జాప్యం. ఆరోగ్య సమస్యలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.    

మరిన్ని వార్తలు