ఈ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది

17 Dec, 2020 06:28 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.తదియ సా.5.55 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తరాషాఢ రా.10.19 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం ఉ.6.34 నుంచి 8.10 వరకు, తిరిగి రా.2.19 నుంచి 3.55 వరకు  దుర్ముహూర్తం ఉ.10.06 నుంచి 10.49 వరకు, తదుపరి ప.2.30  నుంచి 3.12 వరకు అమృతఘడియలు... సా.4.01 నుంచి 5.34 వరకు.

సూర్యోదయం :    6.27
సూర్యాస్తమయం    :  5.25
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు:

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. 

వృషభం: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు తప్పవు. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు నిరుత్సాహం. 

మిథునం: సన్నిహితులతో విభేదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం:పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారుల అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. 

సింహం: మిత్రుల  నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు నూతనోత్సాహం.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులు ఒత్తిళ్లకు లోనవుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.  పనుల్లో అవాంతరాలు.

తుల: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు.  కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.  

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అందరిలోనూ గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులు హోదాలు పొందుతారు.

ధనుస్సు: కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో ఒత్తిడులు. 

మకరం: బంధువుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టర్లకు అనుకూలం. అదనపు రాబడి దక్కుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది. దైవదర్శనాలు.

కుంభం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

మీనం: ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు పుంజుకుంటాయి.  ఉద్యోగులకు  ఉత్సాహం.

మరిన్ని వార్తలు