ఈ రాశి వారికి విచిత్ర సంఘటనలు

17 Feb, 2021 06:56 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; మాఘమాసం;శుక్ల పక్షం షష్ఠి: పూర్తి అశ్విని: రా.10-51 తదుపరి భరణి వర్జ్యం: సా.6-26 నుంచి 8-12 వరకు అమృత ఘడియలు: మ.2-54 నుంచి 4-40 వరకు దుర్ముహూర్తం: ఉ.11-50 నుంచి 12-36 వరకు రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు 

సూర్యోదయం: ఉ.6-30, 
సూర్యాస్తమయం: సా.5-57 
శుక్రమూఢం ప్రారంభం

రాశి ఫలాలు:

మేషం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం: బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు. బంధువులతో సఖ్యత. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

కన్య: అనుకున్న పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. ఆధ్యాత్మిక చింతన. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

ధనుస్సు: పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మకరం: రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. దైవదర్శనాలు. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మీనం: పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మరిన్ని వార్తలు