ఈ రాశివారు వాహనాలు కొంటారు, ఆస్తి లాభ సూచనలు

18 Jan, 2021 06:21 IST|Sakshi

సోమవారం, 18.1.2021 – శ్రీశార్వరినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి శు.పంచమి ఉ.10.11 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం పూర్వాభాద్ర ఉ.9.00 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం రా.7.20 నుంచి 9.04 వరకు, దుర్ముహూర్తం ప.12.31 నుంచి 1.18 వరకు, తదుపరి ప.2.44 నుంచి 3.31 వరకు, అమృతఘడియలు...తె.5.43 నుంచి 7.24 వరకు(తెల్లవారితే మంగళవారం),

సూర్యోదయం :  6.38 
సూర్యాస్తమయం :  5.43
రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు 
యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

మేషం : వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. 

మిథునం : పరిస్థితులు అనుకూలిస్తాయి.  వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు కొంటారు. ఆస్తి లాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కర్కాటకం : వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

సింహం : దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు కొద్దిపాటి చికాకులు.

కన్య : కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలించవు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల : భూవివాదాలు పరిష్కారం. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం : వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు : ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో జాప్యం. సోదరులతో మాటపట్టింపులు. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించవు.

మకరం : పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. ప్రత్యర్థుల నుంచి సాయం అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

కుంభం : కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మీనం : వ్యవహారాలలో పురోగతి. ఆస్తి లాభ సూచనలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు