గ్రహం అనుగ్రహం (18-10-2020)

18 Oct, 2020 06:19 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, నిజ ఆశ్వయుజ మాసం, తిథి శు.విదియ రా.9.07 వరకు తదుపరి తదియ, నక్షత్రం స్వాతి ప.12.40 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం సా.5.55 నుంచి 7.25 వరకు, దుర్ముహూర్తం సా.4.01 నుంచి 4.46 వరకుఅమృతఘడియలు... రా.2.56 నుంచి 4.26 వరకు.

సూర్యోదయం        :  5.56
సూర్యాస్తమయం    :  5.35
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరక

రాశిఫలం:
మేషం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తా శ్రవణం. ధన,వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. ఆప్తుల నుంచి పిలుపు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. భూలాభాలు. అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం: పనులలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా అనుకూలం. వాహనయోగం. చర్చలు సఫలం. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల: విద్యావకాశాలు. ప్రముఖుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పైస్థాయి ప్రశంసలు.

వృశ్చికం: పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

ధనుస్సు: విచిత్రమైన సంఘటనలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆలయ దర్శనాలు. వాహనయోగం. స్థిరాస్తి ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటాయి.

మకరం: ఉద్యోగాన్వేషణలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం

కుంభం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. శ్రమకు ఫలితం ఉండదు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మీనం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ధనవ్యయం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులకు అవకాశం.
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా