గ్రహం అనుగ్రహం (18-11-2020) 

18 Nov, 2020 06:32 IST|Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.చవితి రా.3.44 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం మూల ప.3.20 వరకు, తదుపరి పూర్వాషాఢ వర్జ్యం ప.1.48 నుంచి 3.20 వరకు, తిరిగి రా.12.40 నుంచి 2.11 వరకు, దుర్ముహూర్తం ప.11.22 నుంచి 12.07 వరకు, అమృతఘడియలు... ఉ.9.12 నుంచి 10.43 వరకు.

సూర్యోదయం :    6.10
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశిఫలం:

మేషం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార,ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. శ్రమాధిక్యం.

మిథునం: పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వస్తు,వస్త్ర లాభాలు. సోదరులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. దైవదర్శనాలు.

కర్కాటకం: చిన్ననాటి మిత్రుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం:శ్రమ తప్పదు. పనుల్లో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమార్పులు. ఆలయదర్శనాలు. 

కన్య: వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. అనారోగ్యం. విద్యార్థులకు ఒత్తిడులు.

తుల: నూతన ఉద్యోగయోగం. పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు.  వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు. అనారోగ్యం.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం: కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలలో కనిపించని లాభాలు. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మీనం: ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు.  వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. దైవదర్శనాలు.
 

మరిన్ని వార్తలు