ఈ రాశివారికి సోదరులతో కలహాలు

19 Mar, 2021 06:31 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి శు.షష్ఠి రా.1.21 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం కృత్తిక ఉ.11.05 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం తె.4.43 నుండి 6.29 వరకు (లె ల్లవారితే శనివారం), దుర్ముహూర్తం ఉ.8.32 నుండి 9.21 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.20 వరకు అమృతఘడియలు... ఉ.8.25 నుంచి 10.11 వరకు.

సూర్యోదయం :    6.10
సూర్యాస్తమయం    :  6.06
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

దినఫలాలు
మేషం... కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. బంధువులతో విరోధాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం... కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. బాకీలు వసూలవుతాయి. భూలాభం.

మిథునం... బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఇంటాబయటా ఒత్తిడులు.. దైవదర్శనాలు.

కర్కాటకం... వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం..

సింహం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. సోదరులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

తుల... కుటుంబంలో ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. విద్యార్థులకు కొంత నిరాశ. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

వృశ్చికం... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరులు, సోదరీల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు... పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం... వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. విలువైన వస్తువులు చేజారవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది.

కుంభం... బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

మీనం... కొత్త వ్యక్తులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.
 

మరిన్ని వార్తలు