ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం

19 Apr, 2021 06:14 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.సప్తమి సా.6.46 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం పునర్వసు రా.2.07 వరకు, తదుపరి పుష్యమి వర్జ్యం ప.1.22 నుండి 3.04 వరకు, దుర్ముహూర్తం ప.12.22 నుండి 1.12 వరకు తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు... రా.11.32 నుంచి 1.13 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.12
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు 

మేషం: బంధువులతో సఖ్యత. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. విద్యార్థులకు విజయం. ధన, వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. ఉద్యోగాలు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.

మిథునం: ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

సింహం: కొత్త పనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి.  కీలక నిర్ణయాలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన ఉద్యోగాలు..

కన్య: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

తుల: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం.

వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీనం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.  అనారోగ్యం. సోదరులతో వివాదాలు.

మరిన్ని వార్తలు