ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి

19 Jan, 2021 06:20 IST|Sakshi

మంగళవారం, 19.1.2021-  శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి శు.షష్ఠి ఉ.11.34 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.10.55 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం రా.12.01 నుంచి 1.46 వరకు, దుర్ముహూర్తం ఉ.8.51,నుంచి 9.35 వరకు, తదుపరి రా.10.55 నుంచి 11.44 వరకు, అమృతఘడియలు... లేవు. 

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.43
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: వ్యయప్రయాసలు. మిత్రులు, సన్నిహితులతో వైరం. ఆస్తుల వివాదాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: వ్యవహారాలలో పురోగతి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. 

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తు, వస్త్రలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. పనుల్లో విజయం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

తుల: విచిత్ర సంఘటనలు. విద్య, ఉద్యోగావకాశాలు. కొత్త పనులు చేపడతారు. వాహనయోగం. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: రాబడి కంటే ఖర్చులు అధికం. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. ఇళ్లు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

కుంభం: పాత మిత్రుల కలయిక. ప్రయాణాలు వాయిదా. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మీనం: వ్యవహారాలలో పురోగతి. భూలాభాలు. వివాదాలు పరిష్కారం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు