గ్రహం అనుగ్రహం (19-10-2020)

19 Oct, 2020 06:31 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. నిజ ఆశ్వయుజ మాసం. తిథి శు.తదియ సా.6.40 వరకు, తదుపరి చవితి. నక్షత్రం విశాఖ ఉ.10.55 వరకు, తదుపరి అనూరాధ. వర్జ్యం ప.2.56 నుంచి 4.26 వరకు. దుర్ముహూర్తం ప.12.09 నుంచి 12.55 వరకు, తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు. అమృత ఘడియలు రా.11.54 నుంచి 1.22 వరకు

సూర్యోదయం: 5.56 సూర్యాస్తమయం: 5.34 
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. 
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

రాశిఫలం:

మేషం: ఎంత శ్రమపడ్డా ఫలితం ఉండదు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ఇంటాబయటా అనుకూలస్థితి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

మిథునం: ఉద్యోగయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. భూలాభాలు. సోదరులు, సోదరీలతో సఖ్యత. పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరతాయి.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలించవు. మిత్రులతో వైరం. దూరప్రయాణాలు. కొన్ని పనులలో ఆటంకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా చికాకులు.

కన్య: పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

తుల: ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. దైవదర్శనాలు. ధనవ్యయం. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలలో  సమస్యలు.

వృశ్చికం: పనులు సాఫీగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. నూతన పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో హఠాత్తుగా మార్పులు.

మకరం: వ్యవహారాలలో విజయం. భూలాభాలు కలుగుతాయి. మీ ఖ్యాతి పెరుగుతుంంది. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

కుంభం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు తీరి సఖ్యత ఏర్పడుతుంది. వస్తులాభాలు. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం: వ్యవహారాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

మరిన్ని వార్తలు