గ్రహం అనుగ్రహం (19-11-2020) 

19 Nov, 2020 06:30 IST|Sakshi

    గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.పంచమి రా.2.35 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం పూర్వాషాఢ ప.2.41 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం రా.10.32 నుంచి 12.07 వరకు, దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.37 వరకు, తదుపరి ప.2.21 నుంచి 3.07 వరకు అమృతఘడియలు... ఉ.9.06 నుంచి 11.32 వరకు.

సూర్యోదయం :    6.10
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశిఫలం:

మేషం: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులు, మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహం. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినరీతిలో కొనసాగుతాయి.

సింహం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. ధనవ్యయం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

కన్య: రుణయత్నాలు ముమ్మరం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబబా«ధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. శుభవార్తలు వింటారు. ధనప్రాప్తి. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం: శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

ధనుస్సు: కొత్త వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అభివృద్ధి.

మకరం:కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. శ్రమ తప్పదు. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కుంభం:సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం. నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
 

మరిన్ని వార్తలు