ఈ రాశివారికి శ్రమకు ఫలితం కనిపించదు

19 Jul, 2021 06:25 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి శు.దశమి రా.7.32 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం విశాఖ రా.8.56 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం రా.12.40 నుండి 2.11 వరకు, దుర్ముహూర్తం ప.12.30 నుండి 1.22 వరకు,తదుపరి ప.3.06 నుండి 3.57 వరకు అమృత ఘడియలు... ప.12.43 నుండి 2.13 వరకు.

సూర్యోదయం :    5.38
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు:

మేషం: ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం.

మిథునం: మిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

సింహం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు కార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కన్య: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. భూ ఒప్పందాలు వాయిదా. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

తుల: శుభవార్తలు అందుతాయి. విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలం.

వృశ్చికం: పనులు ముందుకు సాగవు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. మీ ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాల ప్రస్తావన. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.

కుంభం: వ్యూహాత్మకంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మరిన్ని వార్తలు