ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి

2 Mar, 2021 06:23 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.తదియ ఉ.9.10 వరకు, తదుపరి చవితి నక్షత్రం హస్త ఉ.8.53 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం సా.4.21 నుండి 5.52 వరకు, దుర్ముహూర్తం ఉ.8.43 నుండి 9.29 వరకు, తదుపరి రా.10.57 నుండి 11.47 వరకు అమృతఘడియలు... రా.1.22 నుంచి 2.54 వరకు.

సూర్యోదయం :    6.22
సూర్యాస్తమయం    :  6.02
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వేడుకల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. భూయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు. అనారోగ్య సూచనలు.

మిథునం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి.

కర్కాటకం: ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తుంది.

సింహం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యవహారాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు.

కన్య: కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

తుల: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కొన్ని పనుల్లో ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

వృశ్చికం: కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

ధనుస్సు: ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. మిత్రుల కలయిక.  వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. 

మకరం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.

కుంభం: బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింతగా ఒత్తిడులు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు.

మీనం: అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు.  వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగిస్తారు. దైవదర్శనాలు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు