గ్రహం అనుగ్రహం

20 Aug, 2020 07:34 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి శు.పాడ్యమి ఉ.6.39 వరకు,  తదుపరి విదియ తె.4.34 వరకు (తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం పుబ్బ రా.2.55 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం ఉ.11.44 నుంచి 1.15 వరకు, దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.47 వరకు, తదుపరి ప.2.58 నుంచి 3.49 వరకు అమృతఘడియలు... రా.8.50 నుంచి 10.21 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.21
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

దినఫలాలు
మేషం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.

వృషభం: కొద్దిపాటి కుటుంబసమస్యలు.  వ్యాపారాలలో ఒడిదుడుకులు. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.  ఉద్యోగాలలో పనిభారంతో సతమతం.

మిథునం: మిత్రులతో సఖ్యత. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు.  ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు.

కర్కాటకం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అదనపు ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో   గందరగోళం. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. 

సింహం: సన్నిహితులు,మిత్రుల  సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారాలు లాభాలలో నడుస్తాయి. ఉద్యోగాలలో కొంత ప్రోత్సాహం.

కన్య: బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

తుల: ఉద్యోగయత్నాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్నది సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.. ధనలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో  ఒత్తిళ్లు తొలగుతాయి.

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు. ఉద్యోగాలలో  సమస్యలు తీరతాయి..

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో స్వల్ప విభేదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: ప్రయాణాల్లో మార్పులు. ధనవ్యయం.  కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రుల  నుంచి విమర్శలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో  చిక్కులు. 

కుంభం: ఆకస్మిక  ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. దైవచింతన. వ్యాపారాలలో కొంత  ముందడుగు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. 

మీనం: ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. మిత్రుల  నుంచి శుభవర్తమానాలు. భూ వివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.
 

మరిన్ని వార్తలు