ఈ రాశివారికి ఉద్యోగాలలో పనిభారం

20 Aug, 2021 06:16 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.త్రయోదశి రా.8.11 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాషాఢ రా.9.47 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం రా.1.41 నుండి 3.12 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.29 నుండి 1.19 వరకు అమృతఘడియలు...ప.3.42 నుండి 5.14 వరకు, వరలక్ష్మీ వ్రతం.

సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం :  6.20
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం... నూతన ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పనిభారం.

కర్కాటకం... సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

సింహం... మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య... మిత్రుల నుంచి ఒత్తిడులు. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ప్రయాణాలలో అవాంతరాలు.ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

తుల... చేపట్టిన పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

వృశ్చికం... పరిచయాలు పెరుగుతాయి. ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

ధనుస్సు... కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బదిలీలు.

మకరం... నూతన పరిచయాలు. ఊహించని ఆహ్వానాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం... పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం... ఇంట్లో ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మరిన్ని వార్తలు