ఈ రాశివారికి సంఘంలో ఆదరణ..

20 Dec, 2020 06:28 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.షష్ఠి సా.5.30 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం శతభిషం రా.12.01 వరకు, తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం ఉ.6.28 నుంచి 8.06 వరకు దుర్ముహూర్తం సా.3.57 నుంచి 4.41 వరకు అమృతఘడియలు... సా.4.30 నుంచి 6.10 వరకు, సుబ్రహ్మణ్యషష్ఠి.

సూర్యోదయం        :  6.28
సూర్యాస్తమయం    :  5.26
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు:
మేషం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం: వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: సంఘంలో ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు.

కన్య: వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.దూరపు  బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

తుల: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం.

వృశ్చికం: దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

ధనుస్సు: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.

మకరం: వ్యయప్రయాసలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబసమస్యలు తప్పవు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం:  ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.ఉద్యోగులకు పదోన్నతులు.

మీనం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొన్ని మార్పులు. వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం.

మరిన్ని వార్తలు