ఈ రాశివారికి రుణదాతల ఒత్తిడులు

21 Aug, 2021 06:19 IST|Sakshi

శ్రీప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.చతుర్దశి సా.6.34 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం శ్రవణం రా.9.02 వరకు తదుపరి ధనిష్ఠ, వర్జ్యం రా.1.55 నుండి 3.30 వరకు దుర్ముహూర్తం ఉ.5.46 నుండి 7.26 వరకు అమృతఘడియలు...ఉ.10.56 నుండి 12.31 వరకు

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.20
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

మేషం... వ్యవహారాలలో పురోగతి. ఆస్తిలాభం. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృషభం... పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

మిథునం... పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం... చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

సింహం... మిత్రులతో వివాదాలు తీరతాయి. పనులు చకచకా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కన్య... రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల... మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనాలు సమకూర్చుకుంటారు. సోదరులతో సఖ్యత. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు... చిత్రమైన సంఘటనలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం... కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

కుంభం... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు రద్దు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మీనం... నూతన ఉద్యోగయత్నాలు సఫలం. యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.  

మరిన్ని వార్తలు