గ్రహం అనుగ్రహం (21-09-2020)

21 Sep, 2020 06:44 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. అధిక ఆశ్వయుజ మాసం. తిథి శు.చవితి ఉ.7.40 వరకు, తదుపరి పంచమి తె.5.26 (తెల్లవారితే మంగళవారం). నక్షత్రం విశాఖ రా.3.08 వరకు, తదుపరి అనూరాధ. వర్జ్యం ఉ.9.55 నుంచి 11.23 వరకు. దుర్ముహూర్తం ప.12.19 నుంచి 1.08 వరకు, తదుపరి ప.2.44  నుంచి 3.33 వరకు. అమృత ఘడియలు సా.6.52 నుంచి 8.21

సూర్యోదయం: 5.52 సూర్యాస్తమయం: 5.57 
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. 
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు 

రాశిఫలాలు:

మేషం: పనులు అనుకున్న రీతిలో పూర్తి. అందరిలోనూ మీమాటే నెగ్గుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ప్రయాణాలలో స్వల్ప మార్పులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ  కలిగిస్తాయి.

మిథునం:ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. స్వల్ప రుగ్మతలు. ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించవు.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

సింహం:వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కన్య: పనులలో జాప్యం. దైవదర్శనాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

తుల: నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

వృశ్చికం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. స్వల్ప అనారోగ్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

మకరం:కార్యజయం. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కుంభం: వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. దైవచింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
 

మరిన్ని వార్తలు