గ్రహం అనుగ్రహం (21-10-2020)

21 Oct, 2020 06:32 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి శు.పంచమి ప.2.47 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ ఉ.8.20 వరకు, తదుపరి మూల, వర్జ్యం ప.3.58 నుంచి 5.30 వరకు దుర్ముహూర్తం ప.11.20 నుంచి 12.09 వరకు అమృతఘడియలు... రా.1.10 నుంచి 2.43 వరకు.

సూర్యోదయం :    5.57
సూర్యాస్తమయం    :  5.33
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

రాశిఫలం:
మేషం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

వృషభం: రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యవహారాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత బారంగా మారతాయి.

మిథునం: శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కర్కాటకం: శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. దైవదర్శనాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కన్య: బంధువుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళం పరుస్తాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధార ణంగా ఉంటాయి.

వృశ్చికం: ఎంత శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు అసంతృప్తి కలిగిస్తాయి. ఆరోగ్యం మందగుస్తుంది. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు గ్రహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.

మకరం: కుటుంబంలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశలు ఫలిస్తాయి

మీనం: వ్యవహారాలలో విజయం. నూతన ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు