ఈ రాశి వారికి వస్తు, వస్త్ర లాభాలు

21 Feb, 2021 06:55 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి శు.నవమి ప.12.49 వరకు, తదుపరి దశమి నక్షత్రం మృగశిర పూర్తి (24గంటలు) వర్జ్యం ప.12.28 నుంచి 2.13 వరకు దుర్ముహూర్తం సా.4.25 నుంచి 5.11 వరకు, అమృతఘడియలు... రా.10.55 నుంచి 12.39 వరకు.

సూర్యోదయం        :  6.28
సూర్యాస్తమయం    :  5.59
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరక

రాశి ఫలాలు:
మేషం: రుణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం: కుటుంబసభ్యులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాల సందర్శనం.

కర్కాటకం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు.నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

సింహం: ముఖ్య కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్ర లాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని ప్రగతి.

కన్య: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. దైవచింతన.  వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం.

తుల: పనులు మందగిస్తాయి. ప్రయాణాలలో మార్పులు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. కొన్ని పనులు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగులకు హోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ధనుస్సు: ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి. ఆకస్మిక ధనలాభం.  కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మకరం: వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలో నిరుత్సాహపరుస్తాయి. దైవారాధనలో పాల్గొంటారు. ఆరోగ్యభంగం.

కుంభం: ఆర్థిక పరిస్థితి  నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. సన్నిహితులతో సఖ్యత.  వృత్తి, వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు కొత్త ఆశలు.
 

మరిన్ని వార్తలు