ఈ రాశివారికి కష్టమే తప్ప ఫలితం కనిపించదు

21 Jun, 2021 06:29 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.ఏకాదశి ఉ.10.13 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం స్వాతి ప.2.16 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం రా.7.31 నుండి 8.58 వరకు, దుర్ముహూర్తం ప.12.26 నుండి  1.20 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు అమృత ఘడియలు ఉ.6.04 నుంచి 7.34 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.33
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు:

మేషం: శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృషభం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

కర్కాటకం: ప్రముఖులతో పరిచయాలు. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. చర్చల్లో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కన్య: ముఖ్యమైన పనుల్లో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

తుల: అనుకున్న పనులలో జాప్యం. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.

వృశ్చికం: పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పనులు విజయవంతంగా సాగుతాయి.వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

ధనుస్సు: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.

మకరం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. అందరిలో గౌరవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

మీనం: వ్యవహారాలు విజయం. శుభవార్తలు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువుల కలయిక. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.

 

మరిన్ని వార్తలు