ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అశలు

22 Apr, 2021 06:21 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.దశమి సా.6.30 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం మఖ రా.3.21 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం ప.3.21 నుంచి 4.56 వరకు, దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.44 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు అమృతఘడియలు... రా.12.55 నుంచి 2.31 వరకు.

సూర్యోదయం :    5.44
సూర్యాస్తమయం    :  6.13
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు:
మేషం: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అశలు.

కర్కాటకం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పనులు సకాలంలో చక్కదిద్దుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. శ్రమాధిక్యం. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

తుల: బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. మిత్రుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

వృశ్చికం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు: రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

మీనం: ప్రముఖులతో పరిచయాలు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు. 

మరిన్ని వార్తలు