గ్రహం అనుగ్రహం (22-08-2020)

22 Aug, 2020 08:11 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.చవితి రా.12.00 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం హస్త రా.11.56 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం ఉ.9.21 నుంచి 10.50 వరకు, దుర్ముహూర్తం ఉ.5.46 నుంచి 7.26 వరకు, అమృతఘడియలు... సా.6.20 నుంచి 7.48 వరకు, వినాయక చవితి.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.20
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

గ్రహఫలం
మేషం: అనుకున్న వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. ధనలబ్ధి. బంధువులతో విభేదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

వృషభం: కొన్ని పనుల్లో ఆదుర్దా చెందుతారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరాలకు రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

కర్కాటకం: మీ అనుమానాలు కొన్ని నివృత్తి కాగలవు. కార్యజయం. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. సోదరులతో ఉత్సాహంగా గడుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

సింహం: ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. శ్రమకు ఫలితం ఉండదు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.

కన్య: రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో ప్రోత్సాహం. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు ఆశాజనకం.

తుల: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: నూతనోత్సాహం. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రశాంతచేకూరుతుంది.

ధనుస్సు: పట్టుదలతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవదర్శనాలు. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.

మకరం: ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.

కుంభం: ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

మీనం: ఉద్యోగయత్నాలు సఫలం. కుటుంబంలో ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
 

మరిన్ని వార్తలు