ఈ రాశివారికి మిత్రులతో విభేదాలు

22 Aug, 2021 06:35 IST|Sakshi

శ్రీప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి పౌర్ణమి సా.5.21 వరకు, తదుపరి బ.పాడ్యమి నక్షత్రం ధనిష్ఠ రా.8.34 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం తె.3.49 నుండి 5.25 వరకు (తెల్లవారితే సోమవారం) దుర్ముహూర్తం సా.4.38 నుండి 5.30 వరకు అమృతఘడియలు ఉ.10.23 నుండి 11.54 వరకు

సూర్యోదయం        :  5.47
సూర్యాస్తమయం    :  6.20
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు
శ్రావణ పౌర్ణమి, రాఖీ.

 

రాశి ఫలాలు:

మేషం...  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. వేడుకల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

వృషభం...  బంధువుల నుంచి కొన్ని సమస్యలు. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

మిథునం....  కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం... కార్యజయం. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు రాగలవు. పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

సింహం...  వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో ఆదరణ. వాహనయోగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య...  ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు సాగిస్తారు. ఆప్తులతో కలహాలు. అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

తుల...  అనుకోని ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యవహారాలలో విజయం. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు... బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

మకరం...  నూతన పరిచయాలు. సంతోషకరమైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కుంభం... పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని పొరపాట్లు.

మీనం... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు