ఈ రాశివారికి ఒప్పందాలు వాయిదా..

22 Dec, 2020 06:34 IST|Sakshi

శ్రీ శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.అష్టమి రా.7.45 వరకు, తదుపరి నవమి న క్షత్రం ఉత్తరాభాద్ర రా.3.30 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం ఉ.11.56 నుంచి 1.40 వరకు, దుర్ముహూర్తం ఉ.8.40 నుంచి 9.24 వరకు తదుపరి రా.10.40 నుంచి 11.31 వరకు, అమృతఘడియలు...రా.10.20 నుంచి 12.03 వరకు.

సూర్యోదయం :    6.29
సూర్యాస్తమయం    :  5.26
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు..
మేషం: పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. అనుకోని ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి.ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పనులలో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం:వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కర్కాటకం...పనులలో ప్రతిబంధకాలు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కన్య: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వస్తులాభాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆటుపోట్లు.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవరోధాలు.

మకరం: కొత్త పనులు చేపడతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పనుల్లో ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలం.
 

మరిన్ని వార్తలు