ఈ రాశివారికి ఉద్యోగాలలో కీలక మార్పులు

22 Feb, 2021 06:02 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. మాఘ మాసం. తిథి శు.దశమి ప.2.17 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం మృగశిర ఉ.8.30 వరకు, తదుపరి ఆరుద్ర. వర్జ్యం సా.5.28 నుంచి 7.11 వరకు. దుర్ముహూర్తం ప.12.36 నుంచి 1.22 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు. అమృత ఘడియలు...ఉ.8.43 నుంచి 10.30 వరకు, తిరిగి రా.11.30 నుంచి 1.11 వరకు.

సూర్యోదయం 6.28.
సూర్యాస్తమయం 5.59
రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు.
యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు.  

మేషం: శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: ప్రత్యర్థుల నుంచి సమస్యలు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని  చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మిథునం: దూరప్రాంతాల నుంచి  శుభవర్తమానాలు. ఇంటాబయటా అనుకూలం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమర్థతన చాటుకుంటారు.

కర్కాటకం: కష్టించినా పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

సింహం: బంధువుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. భూలాభాలు. వాహనయోగం. వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు.

కన్య: కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. ఆభరణాలు,  వాహనాలు కొంటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

తుల: బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.  చేపట్టిన పనులలో  అవాంతరాలు ఆరోగ్యభంగం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

ధనుస్సు: అనుకున్న వ్యవహారాలు  సాఫీగా సాగుతాయి.  మిత్రుల కలయిక. శ్రమ కొలిక్కి వస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీకు ఎదురులేని పరిస్థితి.

మకరం: కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. వాహనయోగం.

కుంభం: కుటుంబం సమస్యలు తప్పకపోవచ్చు. బంధువర్గంతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మీనం: వ్యయప్రయాసలు. బంధు, మిత్రులతో విరో«ధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు.. ఉద్యోగాలలో కీలక మార్పులు.
 

మరిన్ని వార్తలు