ఈ రాశివారికి చిరకాల ప్రత్యర్థులు మిత్రులవుతారు

22 Jun, 2021 06:23 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం తిథి శు.ద్వాదశి ఉ.7.48 వరకు, తదుపరి త్రయోదశి తె.5.20 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం  విశాఖ ప.12.38 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం సా.4.21 నుండి 5.50 వరకు, దుర్ముహూర్తం ఉ.8.05 నుండి 8.57 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు, అమృతఘడియలు... రా.1.19 నుంచి 2.34 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.33
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

రాశి ఫలాలు:
మేషం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సోదరులతో వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది.

మిథునం: కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం.  వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

సింహం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు,  విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో తగాదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

తుల: చిరకాల ప్రత్యర్థులు మిత్రులవుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. నిర్ణయాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు.

ధనుస్సు: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యత. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం: కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

కుంభం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తు లాభాలు. కోర్టు కేసుల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరీలతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి 

మరిన్ని వార్తలు