గ్రహం అనుగ్రహం (23-09-2020)

23 Sep, 2020 06:26 IST|Sakshi

    గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు అధిక ఆశ్వయుజ మాసం, తిథి శు.సప్తమి రా.1.49 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం జ్యేష్ఠ రా.12.31 వరకు, తదుపరి మూల, వర్జ్యం ఉ.7.01 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ప.11.32 నుంచి 12.16 వరకు అమృతఘడియలు... సా.4.05 నుంచి 5.35 వరకు.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.55
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశిఫలం:
మేషం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులు, ఉద్యోగులకు ఒత్తిళ్లు.

వృషభం: కార్యజయం. ఆస్తిలాభం. ఆదాయం మరింత పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త పోస్టులు. దైవదర్శనాలు.

మిథునం: పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో  ఆటంకాలు తొలగుతాయి.

కర్కాటకం: పనుల్లో కొద్దిపాటి  ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

సింహం: రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో నిదానం పాటించాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి.  బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలలో అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. స్వల్ప అనారోగ్యం. మిత్రులతో  విభేదాలు. వ్యాపారాలు మందకొడిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

వృశ్చికం: శుభవర్తమానాలు. అందరిలోనూ గుర్తింపు. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. ముఖ్యమైన పనుల్లో  అవాంతరాలు. వ్యాపారాలలో కొన్ని చిక్కులు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

మకరం: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు.  ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు.  వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కుంభం: బంధువులతో సఖ్యత. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మీనం: పనిభారం. దూరప్రయాణాలు. మిత్రులతో అకారణంగా విభేదాలు.  కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో సమస్యలు. అనారోగ్యం.
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా