ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు

23 Jun, 2021 06:34 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.చతుర్దశి రా.2.54 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం అనూరాధ ఉ.10.59 వరకు
తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం సా.4.10 నుండి 5.41 వరకు దుర్ముహూర్తం ప.11.34 నుండి 12.26 వరకు అమృతఘడియలు... రా.1.08 నుండి 2.35 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.33
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు: 
మేషం: వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆప్తుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు  సాదాసీదాగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. 

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. 

మిథునం: భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  పాతబాకీలు  అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు  కొత్త హోదాలు. కీలక నిర్ణయాలు.

కర్కాటకం: బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు.  వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులు  బాధ్యతలలో అప్రమత్తంగా మెలగాలి. అనారోగ్యం.

సింహం: బంధువులతో తగాదాలు. ముఖ్యమైన పనులు నిదానిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో  కొన్ని వివాదాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. 

కన్య: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అప్రయత్న కార్యసిద్ధి. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. దూరప్రయాణాలు.

తుల: ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. అనారోగ్య సూచనలు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగులు బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయాలు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి.  వాహనాలు, భూములు కొంటారు. ఆకస్మిక ధనలబ్ధి.  ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనూహ్య లాభాలు. దైవచింతన.

ధనుస్సు: ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. బంధువుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

మకరం: చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో  లాభాలు. ఉద్యోగాలలో  ఉన్నతస్థితి. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. ఆర్థికాభివృద్ధి. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో  పనిభారం నుంచి విముక్తి.

మీనం: బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. కొత్త  రుణాలు చేస్తారు.  దైవదర్శనాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో  అనుకోని మార్పులు.

మరిన్ని వార్తలు