గ్రహం అనుగ్రహం (24-09-2020)

24 Sep, 2020 06:24 IST|Sakshi

గ్రహఫలం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, అధిక ఆశ్వయుజ మాసం, తిథి శు.అష్టమి రా.11.43 వరకు, తదుపరి నవమి నక్షత్రం మూల రా.11.34 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ఉ.8.11 నుంచి 9.44 వరకు, తిరిగి రా.10.05 నుంచి 11.35 వరకు దుర్ముహూర్తం ఉ.9.53 నుంచి 10.41 వరకు, తదుపరి ప. 2.42 నుంచి 3.30 వరకు అమృతఘడియలు... సా.5.23 నుంచి 6.54 వరకు.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.54
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

రాశిఫలం:
మేషం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. దైవచింతన. వాహనయోగం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.

వృషభం: పనులలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు భారంగా మారతాయి.

మిథునం: సన్నిహితులు,స్నేహితులతో వైరం. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

సింహం: కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. భూముల కొనుగోలు యత్నాలు సఫలం. విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కన్య: బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ధనవ్యయం. పనులు వాయిదా పడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల: వివాదాలకు దూరంగా ఉండండి. పనుల్లో ప్రతిష్ఠంభన. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు.  ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాలు తీరతాయి. సోదరుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

మకరం: యత్నకార్యసిద్ధి. ముఖ్యమైన పనులలో విజయం. ఆప్తుల సూచనలు పాటిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.

మీనం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు