ఈ రాశివారికి ఉద్యోగాలలో అనుకూలత

24 Dec, 2020 06:48 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.దశమి రా.11.34 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం అశ్వని పూర్తి (24గంటలు), వర్జ్యం రా.3.54 నుంచి 5.40 వరకు, దుర్ముహూర్తం ఉ.10.10 నుంచి 10.54 వరకు,  తదుపరి ప.2.33 నుంచి 3.15 వరకు, అమృతఘడియలు...రా.12.22 నుంచి 2.10 వరకు.

సూర్యోదయం :    6.31
సూర్యాస్తమయం    :  5.28
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశిఫలాలు:

మేషం:ఉత్సాహంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. శుభవర్తమానాలు. ఆర్థిక లాభాలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.  ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. 

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలయదర్శనాలు.  వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో హోదాలు. 

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి.  ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. 

సింహం: పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో తగాదాలు.  వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: కుటుంబసభ్యులతో విభేదాలు. కుటుంబసమస్యలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో చికాకులు.

తుల: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు. ధనలబ్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగాలలో కొత్త  పోస్టులు. వాహనయోగం.

వృశ్చికం: బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.

ధనుస్సు: నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అందరిలోనూ గౌరవం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.  ఉద్యోగాలలో అనుకూలత.

మకరం: ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. బంధుగణంతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. కొత్త పనులు  ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం: రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  సోదరులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో నిరాశ తప్పకపోవచ్చు.
ఉద్యోగాలలో వివాదాలు.

మరిన్ని వార్తలు