ఈ రాశి వారికి బంధువులతో విభేదాలు

24 Feb, 2021 06:23 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి శు.ద్వాదశి ప.3.47 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం పునర్వసు ఉ.11.19 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం రా.7.32 నుంచి 9.09 వరకు, దుర్ముహూర్తం ప.11.49 నుంచి 12.34 వరకు, అమృతఘడియలు... తె.5.24 నుంచి 7.02 వరకు (తెల్లవారితే గురువారం).

సూర్యోదయం :    6.26
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

రాశి ఫలాలు:

మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు.  ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి..

వృషభం: శ్రమ ఫలిస్తుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మిథునం: శ్రమాధిక్యం. కొన్ని పనులు మధ్యలో  వాయిదా. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పవు. దైవదర్శనాలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. 

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో విశేషం. గౌరవం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు అంచనాలు నిజం కాగలవు.

సింహం: రుణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. బంధువులతో విభేదాలు. దైవదర్శనాలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు.. 

కన్య: ఉద్యోగయత్నాలలో పురోగతి. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి. వాహనయోగం.

తుల: ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

వృశ్చికం: కొత్త రుణాల కోసం యత్నాలు. ఆరోగ్యభంగం. పనులల్లో అవాంతరాలు. దైవచింతన. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి

ధనుస్సు: పనులు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని  చికాకులు. కళాకారుల ప్రయత్నాలు ముందుకు సాగవు. 

మకరం: నూతన పరిచయాలు. గౌరవమర్యాదలు పొందుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. 

కుంభం: కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.  ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి..

మీనం: శ్రమ పెరుగుతుంది.వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఒప్పందాలు వాయిదా.

మరిన్ని వార్తలు