గ్రహం అనుగ్రహం (25-11-2020) 

25 Nov, 2020 06:26 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.ఏకాదశి తె.5.53 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి ద్వాదశి, నక్షత్రం ఉత్తరాభాద్ర రా.8.06 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం... లేదు. దుర్ముహూర్తం ప.11.23 నుంచి 12.08 వరకు, అమృతఘడియలు ... ప.2.54 నుంచి 4.35 వరకు.

సూర్యోదయం :    6.13
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: ఆదాయం కంటే ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారులకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

వృషభం: కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.  వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో  పైహోదాలు దక్కుతాయి.  

మిథునం: కార్యజయం. బాకీలు వసూలవుతాయి.  సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

కర్కాటకం: మిత్రులతో అకారణంగా తగాదాలు. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు.  రాబడి అంతగా ఉండదు. ఉద్యోగాల్లో  పనిభారం. వ్యాపారులకు సామాన్యలాభాలు.  

సింహం: కుటుంబంలో చికాకులు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అనారోగ్య సూచనలు.  వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు పని ఒత్తిడులు.

కన్య: కార్యక్రమాలు సకాలంలో పూర్తి. బంధువులతో సఖ్యత. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు హోదాలు. 

తుల: దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో లాభాలు రాగలవు. ఉద్యోగులకు మరింత అనుకూలం.

వృశ్చికం: కార్యక్రమాలలో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. బంధువులతో అకారణంగా తగాదాలు. అనారోగ్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారులకు అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. 

ధనుస్సు: ముఖ్యమైన కార్యక్రమాలలో  ఆటంకాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. రాబడి అంతగా కనిపించదు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు అనుకోని బదిలీలు.  

మకరం: కార్యక్రమాలలో  విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. పాత మిత్రుల కలయిక. గృహ నిర్మాణయత్నాలు. రాబడి ఆశాజనకం. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు మరింత అనుకూలత. 

కుంభం: ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వివాదాలు చికాకు పరుస్తాయి. కష్టానికి ఫలితం దక్కదు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారుల యత్నాలు ముందుకు సాగవు.  ఉద్యోగులకు చికాకులు.

మీనం: కొన్ని కార్యక్రమాలు సకాలంలో  పూర్తి. అదనపు ఆదాయం. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు  లాభాలు లభిస్తాయి. ఉద్యోగులు విధులు సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా