ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు

26 Apr, 2021 06:28 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.చతుర్దశి ప.12.10 వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం, చిత్త రా.11.21 వరకు, తదుపరి స్వాతి వర్జ్యం ఉ.8.17 నుంచి 9.47 వరకు, తదుపరి తె.4.34 నుంచి 6.04 వరకు(తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.11 వరకు, తదుపరి ప.2.53 నుంచి 3.43 వరకు అమృతఘడియలు...సా.5.21 నుంచి 6.44 వరకు.

సూర్యోదయం :    5.41
సూర్యాస్తమయం    :  6.13
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు:

మేషం: కొత్త వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తప్పవు.

మిథునం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: శుభకార్యాలపై ముఖ్య సమాచారం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలుసర్దుకుంటాయి. 

ధనుస్సు: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత పురోగతి.

మకరం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కుంభం: కష్టానికి ఫలితం దక్కదు. వ్యవహారాలు నెమ్మదిస్తాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మీనం: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.
 

మరిన్ని వార్తలు