గ్రహం అనుగ్రహం

26 Jul, 2020 08:09 IST|Sakshi

గ్రహం అనుగ్రహం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం, తిథి శు.షష్ఠి ప.12.00
వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం హస్త ప.3.44 వరకు
తదుపరి చిత్త, వర్జ్యం రా.10.37 నుంచి 12.00 వరకు, దుర్ముహూర్తం సా.4.48 నుంచి 5.40 వరకు, అమృతఘడియలు... ఉ.10.07 నుంచి 11.54 వరకు.

సూర్యోదయం        :  5.40
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

గ్రహఫలం..
మేషం: ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు. ముఖ్యమైన పనులు  విజయవంతంగా సాగుతాయి. విలువైన సమాచారం. అదనపు ఆదాయం. వ్యాపార లావాదేవీలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.  

వృషభం: బంధువులతో విరోధాలు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు. ధనవ్యయం. ఉద్యోగాలలో మార్పులు.
వ్యాపారాలలో సమస్యలు.

మిథునం: దూరప్రయాణాలు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. ఆప్తులతో వివాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపార విస్తరణయత్నాలలో ఆటంకాలు.  ఉద్యోగాలలో బదిలీలు.

కర్కాటకం: కొత్త పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కొంత శ్రమ పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో  బాధ్యతలు పెరుగుతాయి.

కన్య: కొన్ని పనులు పురోగతిలో సాగుతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

తుల: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం. రాబడి  తగ్గి నిరుత్సాహం చెందుతారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.

వృశ్చికం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు.  వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. 

ధనుస్సు: నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో ఉంటాయి. సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. వ్యాపారాలలో  నూతన పెట్టుబడులు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

మకరం: పరిస్థితులు అనుకూలించవు. రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. బంధువర్గంతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.

మరిన్ని వార్తలు