గ్రహం అనుగ్రహం(26-08-2020)

26 Aug, 2020 06:23 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.అష్టమి ప.2.34 వరకు, తదుపరి నవమి, నక్షత్రం అనూరాధ సా.5.44 వరకు, తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.11.03 నుంచి 12.33 వరకు, దుర్ముహూర్తం ప.11.36 నుంచి 12.26 వరకు, అమృతఘడియలు... ఉ.7.54 నుంచి 9.22 వరకు.
సూర్యోదయం :    5.48
సూర్యాస్తమయం :  6.17
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం.. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి. ధనవ్యయం. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో చికాకులు.

వృషభం.. ఆశ్చర్యకర సంఘటనలు. విలువైన సమాచారం. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వస్తులాభాలు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరం.

మిథునం.. సన్నిహితులు, మిత్రులు సహకరిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు. పరపతి పెరుగుతుంది. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కర్కాటకం.. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం.. వ్యయప్రయాసలు. శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. మానసిక వేదన. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కన్య.. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. నిర్ణయాలు మార్చుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

తుల.. కుటుంబంలో చికాకులు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ధనవ్యయం. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి.

వృశ్చికం.. భూలాభాలు. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

ధనుస్సు.. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యవహారాలలో అవరోధాలు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం.వ్యాపారాల విస్తరణకు విరామం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం.. ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొటారు. దైవచింతన. ధనలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతి.

కుంభం.. వ్యవహారాలలో పురోగతి. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. చర్చలు సఫలం.  వ్యాపారాలు, ఉద్యోగాలు విజయవంతంగా సాగుతాయి.

మీనం.. పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

మరిన్ని వార్తలు