గ్రహం అనుగ్రహం(26-09-2020)

26 Sep, 2020 06:22 IST|Sakshi

    గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, అధిక ఆశ్వయుజ మాసం, తిథి శు.దశమి రా.9.44 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం ఉత్తరాషాఢ రా.11.02 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం ఉ.7.05 నుంచి 8.40 వరకు, తిరిగి రా.3.05 నుంచి 4.42 వరకు, దుర్ముహూర్తం ఉ.5.54 నుంచి 7.30 వరకు, అమృతఘడియలు... సా.4.36 నుంచి 5.57 వరకు.

సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.53
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

రాశిఫలం:

మేషం: పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం:వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మిథునం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

సింహం: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

తుల: శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

ధనుస్సు: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. భూ, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయి.

మకరం: ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి లాభం. సోదరుల కలయిక. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మీనం: పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

 

మరిన్ని వార్తలు